తెలుగు తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలకు జీవం పోసిన సీనియర్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీ రావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గత కొంత కాలంగా